ఆటాడుకుందాం రా మూవీ రివ్యూ

641
aatadukundam-raa-movie-review
aatadukundam-raa-movie-review
- Advertisement -

చాలాకాలం గ్యాప్ తర్వాత సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆటాడుకుందాం రా. అక్కినేని ఫ్యామిటీ నుంచి  హీరోగా ఎంటరై తనేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న హీరోల్లో సుశాంత్‌ ఒకడు. ‘కరెంట్‌’ చిత్రంతో తనలోని కరెంట్‌ను తీసుకువచ్చినా. ఆ తర్వాత రెండు చిత్రాలు బిలో యావరేజ్‌లో ఆడాయి. తాజాగా ఆయన జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా’ అంటూ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి సుశాంత్‌కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చిందా..?అభిమానుల అంచనాలను అందుకుందా లేదా చూద్దాం..

కథ :

విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) ఇద్దరు మంచి స్నేహితులు. ఆనంద్ ఇచ్చే సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. అయితే విజయరామ్‌ సక్సెస్ చూసి తట్టుకోలేకపోయిన శాంతారామ్  దొంగ దెబ్బతీస్తాడు. శాంతారామ్ చేసే మోసం ఆనంద్‌పై పడుతుంది.  ఈ ఎఫెక్ట్‌తో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్ద‌రూ విడిపోతారు. తర్వాత అమెరికాలో ఉండే కార్తీక్ (సుశాంత్‌) అమెరికా నుంచి ఇండియాకు వ‌స్తాడు. కార్తీక్ విజ‌య్‌రామ్‌కు అల్లుడు. విజ‌య్‌రామ్‌కు అత‌డి చెల్లుల‌న్నా, ఆమె కుటుంబం అన్నా అస్స‌లు గిట్ట‌దు. అలాంటి విజ‌య్‌రామ్‌కు కార్తీక్ ఎలా ద‌గ్గ‌రై ? త‌న మామ క‌ష్టాలు తీర్చాడు ? విజ‌య్‌రామ్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ ఏమ‌య్యాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ ?

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ, సుశాంత్. హీరో సుశాంత్ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్.. అన్నీ చేయగలనని సుశాంత్ ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సోనమ్ భజ్వా నటన పరంగా ఫర్వాలేదనిపించినా, పాటల్లో అందాల ప్రదర్శన చేసింది.ఫస్టాఫ్‌లో పృథ్వీ, సుశాంత్‌ల మధ్యన వచ్చే కామెడీ అని చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెల్ని అంటూ వచ్చే ఝాన్సీ కామెడీ ఆకట్టుకుంది. పోసాని కృష్ణమురళి కామెడీ ఫర్వాలేదనేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ.ఫస్టాఫ్‌లో కొంత మేర కథ కనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎక్కడా కథే లేదు. కథలో బలం లేకపోవటంతో  క్లైమాక్స్ వరకూ టైమ్ మెషీన్ అంటూ, చీటింగ్ అంటూ, వందల కోట్ల మనీ ట్రాన్స్‌ఫర్ అంటూ అర్థం లేని సన్నివేశాలతో లాగించారు. క్యారెక్టరైజేషన్స్ కూడా ఎక్కడా ఆకట్టుకునేలా లేవు. ఇక సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ కూడా లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా అనూప్ పాటలు బిలో యావరేజ్. ఆర్ ఆర్ బాగాలేదు. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫీ రిచ్ లుక్ తీసుకువచ్చింది. దర్శకుడు జీ. నాగేశ్వర్ రెడ్డి గురించి చెప్పుకుంటే, ఒక కామెడీ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవేవీ లేకుండా ఒక నీరసమైన కథ, కథనాలతో సినిమా తీయడం దగ్గరే విఫలమయ్యాడు. అలాంటి నీరసమైన కథతోనే అక్కడక్కడా నవ్వించినా, ఓవరాల్‌గా మాత్రం నిరాశపరచాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

సినిమాలో హీరో సుశాంత్ జస్ట్ చిల్ అంటూ సరదాగా సాగిపోయే పాత్రలో నటించాడు. డ్యాన్సు,ఫైట్స్‌ తో తనేంటో నిరూపించుకున్నాడు. సరైన కథను ఎంచుకోవడం…దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా నవ్వించే సుశాంత్-పృథ్వీ కామెడీ, సెకండాఫ్‌లో టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయి అంశాలేవీ లేవు. ముందే తెలిసిన ఒక కథతో, ఎలా ఉంటుందో ముందే ఊహించేయగల సన్నివేశాలతో ఓ కామెడీ సినిమా వస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాయే ‘ఆటాడుకుందాం రా’.

విడుదల తేదీ : 19/08/2016

రేటింగ్ : 2.5/5

నటీనటులు : సుశాంత్, సోనమ్ భజ్వా..

సంగీతం : అనూప్ రూబెన్స్

నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, ఏ. నాగ సుశీల

దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి

- Advertisement -