TRS సభ్యత్వ నమోదుకు అద్భుత స్పందన..

359
ktr meeting
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షులు కెటి రామారావు ఈ రోజు సమీక్షించారు. పార్టీ సభ్యత్వ నమోదుకు అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తున్నదన్నారు. ఇప్పటికే పార్టీ సభ్యులుగా 40 లక్షల సభ్యులు పార్టీ సభ్యత్వం తీసుకున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతన్నదని తెలిపారు. ఇందులో దాదాపు 20 లక్షల సభ్యులు వివరాలను పార్టీ డిజిటలీకరణ పూర్తి చేసిందని తెలిపారు. పలు నియోజక వర్గాల్లో లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు జరిగిందని, ఇలాంటి చోట్ల మరిన్ని సభత్వ నమోదు పుస్తకాలను పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారని తెలిపారు.

సభ్యత్వ నమోదు పూర్తి అయిన చోట్ల కమీటీల ఎర్పాటుపైన దృష్టి సారించాలని కేటీఆర్‌ పార్టీ ఇంచార్జులను కోరారు. సభ్యత్వ నమోదు, డిజిటలీకరణ కార్యక్రమ ఇంచార్జీలతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్‌ సభ్యత్వ నమోదును ప్రక్రియను సమీక్షించారు. ప్రతి నియోజకవర్గం వారీగా ఏ మేరకు సభ్యత్వ నమోదు జరిగింది, డిజిటలీకరణ జరిగింది ఎంత వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల పూర్తి వివరాలను సేకరించాలని ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కనీస వివరాలను అందిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. ఈ వివరాల అధారంగానే కార్యకర్తల భీమా సౌకర్యం ముడిపడి ఉన్నదని తెలిపారు. సరైన వివరాలు ఇస్తేనే భీమా సౌకర్యానికి ఏలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

ktr Review meetingపట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చురుగ్గా కొనసాగుతున్నదని ఇంచార్జీలు కేటీఆర్‌కు తెలిపారు. రానున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వస్తున్న స్పందన పట్ల కేటీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వం నమోదు పూర్తి అయినచోట్ల బూత్ స్ధాయిలో కమీటీల ఏర్పాటు వేంటనే ప్రారంభించాలని కేటీఆర్‌ పార్టీ ఇంచార్జీలకు సూచించారు.

నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించిన కేటీఆర్‌, లక్ష్యం మేరకు సభ్యత్వాన్ని పూర్తి చేసిన పార్టీ ఇంచార్జీలను, స్ధానిక ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో లక్ష్యం సభ్యత్వ నమోదు పూర్తి అయ్యే అవకాశం ఉన్నదని, నెలాఖరులోగా మెత్తం ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉన్నదని ఇంచార్జీలు కేటీఆర్‌కు తెలిపారు. నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(24 తేదిన జరిగిన) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -