ఎయిర్ హోస్టెస్ ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అందమైన అమ్మాయిలు,విమానం ఎక్కేముందు స్వాగతం పలకడం,ఫ్లైట్ జర్నీలో సహాయం అందిస్తుంటారు. ఇప్పటివరకు మనం విమానాల్లోనే ఎయిర్ హోస్టెస్‌ని చూసేవాళ్లం…అయితే ఇకపై రైళ్లలో కూడా ఎయిర్ హోస్టెస్ దర్శనమివ్వనున్నారు.
ఈ తరహా సేవలను కొన్ని రైళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఈ తరహా సేవలు ఇప్పటికే గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులో ఉండగా త్వరలో రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లలలో మేల్ స్ట్యువర్ట్ కూడా ప్రయాణీకులకు అతిథ్య సేవలందించనున్నారు.
ప్రయాణీకులకు స్వాగతం పలకడంతో పాటు భోజనం, వార్త పేపర్లు, మ్యాగజైన్లను అందివనున్నారు. ట్రైన్ హోస్టెస్‌లు దుస్తులపై యాప్రాన్‌లు వేసుకుని చేతికి గ్లవ్స్ ధరిస్తారు,తలకు టోపీలు పెట్టుకుంటారు. ప్రయాణీకులతో ఎలా మాట్లాడాలి. ఎలా వ్యవహరించాలి..తదితర వాటిపై శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 2 వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. మొత్తంగా రైల్వే తీసుకొస్తున్న ఈ కొత్త విధానం ఏమేరకు సత్ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి.