టిక్ టాక్ చేసి ఉద్యోగం పొగొట్టుకున్న లేడీ పోలీస్

367
Tiktok
- Advertisement -

టిక్ టాక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టిక్ టాక్ ను లో వీడియోలు చేస్తున్నారు. ఈటిక్ టాక్ వల్ల చాలా మంది సెలబ్రెటీలు కూడా అయ్యారు. ముఖ్యంగా తమ టాలెంట్‌ను చూపించాలనుకుంటోన్న కొంతమంది మేకప్‌లు వేసుకొని మరీ అందులో వీడియోలు చేస్తున్నారు. కొంత మందికి టిక్ టాక్ అదృష్టాన్ని ఇస్తే మరికొంత మందికి దృరదృష్టాన్ని కూడా ఇచ్చింది. అలాగే టిక్ టాక్ వల్ల కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

అలాగే మరికొంత మంది తమ ఉద్యోగాలను కూడా కోల్పోతున్నారు. తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ టిక్ టాక్ చేసి తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంది. గుజరాత్ లో ఈసంఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని మెహ్సానా జిల్లాలలోని లంగన్ పోలీస్ స్టేషన్ లో అర్పితా అనే మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఇటివలే ఆమె పోలీస్ స్టేషన్ లో ఓ టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసింది.

ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఆమెను సస్పెండ్ చేశారు అధికారులు. ఈవిషయంపై డీఎస్పీ మాట్లాడుతూ.. అర్పితా డిపార్ట్ మెంట్ రూల్స్ ను పాటించలేదు.. డ్యూటీలో ఉండి కూడా యూనిఫాం ధరించలేదు. క్రమశిక్షణ పాటించాల్సిన పోలీసులు ఇలా చేయడం దారుణం అని..అందుకే అమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇటివలే ఖమ్మం కార్పోరేషన్ అధికారులు కూడా టిక్ టాక్ లో వీడియో చేసిన సస్పైండైన సంగతి తెలిసిందే.

- Advertisement -