- Advertisement -
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తల్లి సింగిరెడ్డి తారకమ్మ మృతి చెందారు. వృద్దాప్యం కారణంగా తారకమ్మ ఇవాళ ఉదయం వనపర్తిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తారకమ్మ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్పీకర్ పోచారం, మంత్రి జగదీష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తారకమ్మ అంత్యక్రియలు ఈరోజు మూడు గంటలకు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వనపర్తి కి 13 కిలోమీటర్ల దూరంలోని పాన్‌గల్ మండలం కొత్తపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -