యూనివర్సల్ స్టార్ రజనీ కాంత్ – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అటు రజనీ, ఇటు శంకర్ వీరిద్దరి కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2010లో వచ్చిన ఈ సినిమాకు కంటిన్యూగా ఇప్పుడు 2.0 తెరకెక్కుతోంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ముంబైలో అతిరధ మహారథుల సమక్షంలో 2.0 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్, రజనీ కాంత్ ఎదురుగా ఉన్న లుక్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ లుక్ అదిరిపోయిందంటూ ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేసేశారు. రజనీ అభిమానులు ఈ లుక్‌లో లైక్‌లు, కామెంట్లు, షేర్లతో రెచ్చిపోతుంటే మరో పక్క శంకర్ టార్గెట్‌గా విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి.
భారీ చిత్రాలను తనదైన స్టైల్లో తెరకెక్కించే శంకర్ ఈ లుక్‌ను ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టాడన్న ప్రచారం జరుగుతోంది. రజనీ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసే టైంలో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని…శంకర్‌కు అసలు కాపీ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ కాపీ కొట్టడంతో పెద్ద ఎత్తున్న విమర్శలు స్టార్ట్ అయిపోయాయి. శంకర్ అసలు లుక్‌నే కాపీ కొట్టాడా ? లేదా సినిమా అంతా కాపీ కొట్టాడా ? అన్న అనుమానాలను సినీజనాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబాయిలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ .. హాలీవుడ్ కు చెందిన సినిమాను పోలేలా ఉండడంతో కొంతమంది దీనిపై పెదవి విరుస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అయ్యిండి శంకర్ ఇలా కాపీ కొట్టడం యేంటని సందేహ పడుతున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీగా నిర్మిస్తుండగా, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.