సాంకేతిక విప్లవం ప్రయోజనకరంగా ఉన్నా.. వినియోగంలో మాత్రం పెడ ధోరణి కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొబైల్స్‌లో సెల్ఫీ ఆప్షన్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో లైక్‌ల కోసం తీసుకుంటున్న సెల్ఫీ ఫొటోల కోసం ప్రమాదం అంచున పడుతున్నారు. సెల్ఫీ మోజు వద్దు అంటూ ఎంత అవేర్‌నెస్ తెస్తున్న ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఓ యువకుడు ఏకంగా పాముతో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్త వైరల్‌గా మారింది. దీంతో కటకటాల పాలయ్యే పరిస్థితి వచ్చింది ఆ యువకుడికి.
వివరాల్లోకి వెళ్తె ఒడిశాలోని బరగఢ్‌కు చెందిన రోహిత్ మేహర్ పాములు పట్టుకోవడం దిట్ట. అతడు నివసిస్తున్న సమీపంలో ఓ నాగుపాము రాగా దాన్ని పట్టుకున్న రోహిత్ దానితో సెల్ఫీలు దిగాడు. ఈ ఫోటోలను ఇటీవల అతడు సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు రోహిత్‌ని అరెస్ట్ చేశారు. వన్య ప్రాణులకు హాని కలిగించే చర్యలు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో స్నేక్ పట్టడంలో ఎక్స్‌పర్ట్‌గా ఉన్న రోహిత్ తీసిన సెల్ఫీలు అతన్ని కటకటాల పాలుచేశాయి.