మాస్ మహారాజ రవితేజ గతకొంత కాలంగా ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్ని అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా అనే మూవీని చేస్తున్నారు. ఈచిత్ర ఘూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రవితేజ సరసన హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.
రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈచిత్రం తర్వాత రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో రవితేజ తర్వాతి సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. అజయ్ భూపతికి రవితేజ కు ఇటివలే కథ వినిపించినట్లు సమాచారం.
కథ నచ్చడంతో అజయ్ కి పూర్తీ స్క్రీప్ట్ ను రెడీ చేయమని చెప్పాడట రవితేజ. అయితే ఇదే కథను గతంలో నాగ చైతన్య, నాని లకు వినిపించాడట దర్శకుడు అజయ్ భూపతి. అయితే వాళ్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రవితేజ దగ్గరకు వెళ్ళాడు. ఈ చిత్రిన్ని జెమిని కిరణ్ నిర్మించనున్నాడని తెలుస్తుంది. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.