సాయిబాబా సన్నిధిలో మాజీ మంత్రి హరీష్‌…

565
harish rao
- Advertisement -

గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేటలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ సద్గురువుల ఆశిస్సులతో సత్ సంకల్పం సిద్ధిస్తుందని అన్నారు.

గురు పౌర్ణమి పర్వదినం ఎంతో శ్రేష్ఠమైనదని… గురువులను పూజించే గొప్ప పండుగ అన్నారు. సాయిబాబా దయ వలన మనం అందరం సంతోషంగా ఉండాలని.. అన్నింటా శుభం చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ గురు పౌర్ణమి రోజన మనం అందరం సద్గురు సాయిబాబాని పూజిస్తామని.. ఈరోజున సద్గురువులను పూజించడం గురువుల ఆశీస్సులు తీసుకోవడం మనం చేసే పనిలో, మనం కోరుకొనే సత్సంకల్పములు సిద్ధిస్తాయన్నారు.

- Advertisement -