నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

612
nani Gangleader Firstlook
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్.కె దర్శత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. నాని .. ఆయన గ్యాంగ్ తో కూడిన పోస్టర్ ను ఫస్టులుక్ గా వదిలారు.

ఐదుగురు మహిళలు కళ్లకు బైనాక్యులర్‌ పెట్టుకుని చూస్తుండగా..నాని మాత్రం బైనాక్యులర్‌ను చేతిలో పట్టుకుని ఉన్న లుక్‌ ఆసక్తికరంగా ఉంది. గ్యాంగ్‌ లీడర్‌ మొదటి సాంగను జులై 18న, జులై 24న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. 24వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్టులో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ విలన్‌గా కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈచిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -