ధూప దీప నైవేద్యం కోసం రూ. 27 కోట్లు మంజూరు

423
telangana temples
- Advertisement -

దేవాదాయ శాఖ లోని దేవాదాయ శాఖ అర్చకులకు సంబంధించి దుప దీప నైవేద్యం కొరకు 27 కోట్ల 68 లక్షల 21 వేల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాలకు మహర్దశ వచ్చింది. అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక నిధి ద్వారా వేత‌నాలు చెల్లించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం.

ధూప దీప నైవేద్య పథకాన్ని 2018 సెప్టెంబర్‌ నుంచి అమలు చేస్తున్నారు. మొత్తం 3,645 ఆలయాల అర్చకులకు ఏడాదికి రూ.27.5 కోట్లను గౌరవవేతనం ద్వారా చెల్లిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే ఆల‌య ఉద్యోగులు, అర్చ‌కులకు రూ. 8,000, ప‌ట్ణ‌ణ ప్రాంతాల్లో ప‌ని చేసే వారికి రూ.10,000, కాంట్రాక్టు / NMR బేసిస్ మీద ప‌ని చేసే రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.12,000 ల‌ను వారు ప‌ని చేసే ప్రాంతం, వ‌ర్క్ లోడ్ ఆధారంగా క‌నీస వేత‌నం ఇస్తోంది ప్రభుత్వం.

- Advertisement -