తెలంగాణ ఫోక్ సింగర్స్‌ మౌనిక, సోనిలతో మా పల్లె ముచ్చట్లు.. వీడియో

636
maa palle pata
- Advertisement -

పల్లె బతుకులో పాటకు ప్రధానమైన స్థానం ఉంది. అక్కడ అడుగడుగునా పాట వినిపిస్తుంది. వ్యవసాయ పనుల్లో పాట లేనిదే ఏ పనీ జరగదు. నాట్లకు పాట, కలుపులకు పాట, పంట కోతలకు పాట, బంతి కట్టేందుకు పాట, బాయి నుంచి నీరు తోడేందుకు పాట! పశువులను కాస్తూ అలసట రాకుండా ఉండేందుకు కాపరి నోట పాట వినిపిస్తుంది. ఇక సాయంత్రం గూటికి చేరిన తరువాత గుక్కెడు గంజి తాగి బయటపడితే నడి రాత్రి వరకు నానా రకాల పాటలతో, కథలతో కాలక్షేపం జరగవలసిందే. పాటకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది.

మనిషి జీవితంలో పాట అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అటువంటి పాటలనే తెలంగాణ ఉద్యమంలో పాటనే తూటాగా మలిచి, ఉద్యమానికి ఊపిరిలూది, తెలంగాణ రాష్ట్రంలో తమ మాటలు, పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, సాంస్కృతిక కళాకారులుగా రాణిస్తున్న తెలంగాణ కళామతల్లి ముద్దు బిడ్డలు మామిండ్ల మౌనిక, సోని యాదర్లతో గ్రేట్‌ తెలంగాణ టీవీ ముచ్చటించింది. తెలంగాణ ఉద్యమంలో పాటల ప్రవాహాన్ని పారించి, ప్రత్యేక రాష్ట్రంలో సాంస్కృతిక కళాకారులుగా రాణిస్తున్న వీరిరువురు తమ అనుభవాలను, మనోగతాలను గ్రేట్‌ తెలంగాణ టీవీతో పంచుకున్నారు.

- Advertisement -