ఇద్దరు వద్దు ఒకరే ముద్దు..మారుతున్న ట్రెండ్‌..!

442
world population day
- Advertisement -

ఇద్దరు వద్దు ఒకరు ముద్దు…ఇది అధిక జనాభాను నియంత్రించేందుకు తీసుకువచ్చిన నినాదం. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా,ఉపాధి అవకాశాలు లేక కనీస అవసరాలకు నోచుకోలేని స్ధితిలో ఆఫ్రికా వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితే తమకు రాకుండా ప్రపంచదేశాలు జాగ్రత్త పడుతున్నాయి.

ముఖ్యంగా భారత్‌, చైనాలు జనాభా వృద్ధిలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం అధిక జనాభా కలిగిన చైనాను భారత్ 2027 నాటికి వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణలో భారతీయుల ఆలోచన విధానంలో మర్పువచ్చింది.

జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా యూసి బ్రౌజర్ భారతీయుల్లో జనాభా పెరుగుదలపై ఉన్న అవగాహనను తెలుసుకునేందుకు ఓ సర్వే చేపట్టింది. ఇందుకోసం ఒకే బిడ్డను కలిగివుండాలన్న చైనా ఫాలసీ ఇండియాలో అమలు చేయాలని కోరుకుంటున్నారా..? అని ప్రశ్నించగా ఈ సర్వేలో దాదాపు 70 శాతం మంది అవును అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 45వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 30శాతం మంది వద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు.

జనాభా నియంత్రణకు తోడు మారుతున్న జీవన పరిస్థితుల్లో కుటుంబపోషణ భారమైపోయింది. ఆకాశన్నంటుతున్న ధరలు,ఉన్నత విద్య మిథ్యగా మారడం,ఉపాధి అవకాశాలు తగ్గడం, భార్య,భర్త ఇద్దరు పనిచేస్తే తప్ప ఓ మధ్యతరగతి కుటుంబం బ్రతుకు భారమవుతున్న నేపథ్యంలో ఒక సంతానం వైపే మొగ్గుచూపుతున్నారు మెజార్టీ భారతీయులు.

- Advertisement -