నేటి నుంచి టీ న్యూస్‌…ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

347
tnews
- Advertisement -

టీన్యూస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించనున్నారు. వేదిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌,విశ్వేశ్వరయ్య భవన్,ఖైరతాబాద్ సర్కిల్,హైదరాబాద్‌. ఈ కార్యక్రమానికి ప్రింట్ మీడియా పార్ట్ నర్స్‌ నమస్తే తెలంగాణ,మన తెలంగాణ. వెబ్ మీడియా పార్ట్ నర్స్‌ greattelangaana.com,gt tv. ప్రవేశం ఉచితం.

వైద్యవిద్యలో ప్రవేశం కోసం మన రాష్ట్రంలో ఏటా దాదాపు లక్షమంది ఎంసెట్ రాస్తున్నారు. కానీ సీట్లు చూస్తే చాలా పరిమితం. అందుకే ఎంబీబీఎస్ చదవాలనీ ఆసక్తి ఉండీ, అవకాశం లభించనివారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇలా నిరాశపడే విద్యార్థులు ప్రత్యామ్నాయంగా విదేశీ వైద్యవిద్యవైపు చూస్తున్నారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే కన్సల్టెన్సీలను సంప్రదించాల్సిన పరిస్థితి. దీనిని క్యాష్ చేసుకుంటున్న కొన్ని కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసగించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు వారి సందేహాలను నివృత్తి చేసేందుకు టీ న్యూస్ తీసుకొస్తున్న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ఓ వారధి కానుంది.

ఏ ఏ దేశాల్లో ఎంబీబీఎస్ చేయవచ్చు..?ఆ దేశాల యూనివర్సిటీలో ఎంత ఫీజు ఉంది..?ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏ దేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఆసక్తి చూపించారు..? ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాదు ప్రతిష్టాత్మక విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులను డైరక్టుగా కలుసుకునే అవకాశం కలుగుతుంది.

భారతీయ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నిబంధనలూ, సూచనల ప్రకారం ఏ యూనివర్సిటీల్లో చదివితే బాగుంటుంది అనే విషయాలను నిపుణులు ఇచ్చే సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఆయా దేశాల ప్రభుత్వ గుర్తింపు ఉందా..? విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి తిరిగి భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చా..?అనే అంశాలతో పాటు ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఫెయిర్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సహా పెద్ద సంఖ్యలో హాజరై తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటోంది greattelangaana.com,gt tv.

- Advertisement -