15 మంది ముందు ఆ సీన్స్‌..చాలా కష్టం:అమలాపాల్

1719
amala paul ame
- Advertisement -

సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ‘ఆమె’. ఆడై సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. జులై 19న సినిమా విడుద‌ల కానుండగా ఈ మూవీలో తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించింది.

తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని నిర్మాత అన్నారని, అయితే ఆ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపింది. నగ్న సన్నివేశాల చిత్రీకరణ రోజు దడ పుట్టిందని.. సెట్‌లో ఎం జరుగుతుందో? ఎవరెవరు ఉంటారో, తగిన రక్షణ ఉంటుందా? అన్న భయం కలిగిందని చెప్పుకొచ్చింది. సెట్‌కు వెళ్లిన తర్వాత ధైర్యం వచ్చిందని కేవలం 15 మందే ఉండటంతో వారిపై నమ్మకంతో ధైర్యంగా ఆ సన్నివేశాల్లో నటించానని చెప్పుకొచ్చింది.

ఇక చిత్ర యూనిట్ సైతం అమలాపాల్ న్యూడ్‌గా నటించే సన్నివేశాలప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుందట. నగ్నంగా నటించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నమ్మకమైన 15 మందిని మాత్రమే సెట్‌లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. వారి నుంచి కూడా సెల్‌ఫోన్లను తీసుకుని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తరువాతనే తిరిగి ఇచ్చేవారట.మొత్తంగా ఆమెతో సెన్సేషన్‌ క్రియేట్ చేయబోతోంది అమలాపాల్.

- Advertisement -