ఉద్యమకారులకు ఆయన అన్యాయం చేశారుః ఎమ్మెల్యే చందర్

322
Chandar Somarapu
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కారన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్ధానం కల్పించినా కూడా పార్టీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. సోమారపు సత్యనారాయణ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే చందర్ ఖండించారు.

సోమారపు సత్యనారాయణ తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కి ఆయన అనుచరులకు పలు పదవులు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సోమారపు సత్యనారాయణ పనిచేశారని ఆయన ఆరోపించారు.

తన ఓటమికి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమాన్ కారణం అంటూ అయన చేసిన వ్యాఖ్యలు అనవసరం అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సోమారపు సత్యనారాయణ నష్టం చేశారని విమర్శించారు. అతను పార్టీని విడిపోవడం వల్ల వచ్చే నష్టమేమి లేదన్నారు.

- Advertisement -