- Advertisement -
మాంచెస్టర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. మరికాసేపట్లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా, వర్షం మొదలవడంతో మ్యాచ్ నిలిపివేశారు. మైదానాన్ని చాలావరకు కవర్లతో కప్పివేశారు. వర్షం కారణంగా పోరు ఆగిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేశారు. క్రీజులో రాస్ టేలర్ (67), టామ్ లాథమ్ (3) ఉన్నారు.
వర్షం మరింత పెరగడంతో మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్ సాధ్యమైన పక్షంలో ఓవర్లు కుదించాల్సి వస్తే, టీమిండియా లక్ష్యం 20 ఓవర్లలో 148 పరుగులు కానీ, 46 ఓవర్లలో 237 పరుగులు కానీ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ రోజే మ్యాచ్ ముగించేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
- Advertisement -