డబ్బులు ఎవరికి ఉరికే రావు..నగలకు సంబంధించి ఏదైనా యాడ్ టీవీలో వస్తే గుర్తుకు వచ్చే కొటేషన్ ఇది. ఈ కొటేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకుందో ఏమో తెలియదు గానీ నగల వ్యాపారంలోకి అడుగుపెట్టారు సినీ నటి,హీరోయిన్ కాజల్ అగర్వాల్.
ముంబైలో ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఏ బిసినెస్ లో అయినా నష్టాలు వస్తాయేమో గాని బంగారం బిజినెస్ లో మాత్రం నష్టాలు ఉండవు. అన్ని లాభాలే. అందుకే ఇండియాలో ఎన్ని నగల దుకాణాలు ఉన్నా సర్వైవ్ అవుతూనే ఉంటాయి. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్న డబ్బును బిజినెస్‌లో పెడుతోంది కాజల్.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్…అనతికాలంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగింది. ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు యాడ్స్ లో నటిస్తూ.. షాపింగ్ మాల్స్ వగైరా వగైరా ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంది కాజల్. పలు రకాల బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేసిన కాజల్ తాజాగా ప్రారంభించిన నగల బిజినెస్‌ను డెవలప్ చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతోంది.