సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. రెండు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ జమ్ము కాశ్మిర్ లో ప్రారంభమయింది. మొదటి రోజు నుంచే మహేశ్ బాబు ఈషూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
అయితే ఈమూవీకి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ లొకేషన్ లో మహేష్ మిలిటరీ దుస్తులు ధరించి తన తోటి ఉద్యోగులతో ఏదో చర్చిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో మహేష్ పక్కన రాజేంద్రప్రసాద్ కూడా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈమూవీలో మహేశ్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన నటిస్తుంది. విజయశాంతి గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న ఈఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.