పంజాబ్‌కు సుష్మా…మహారాష్ట్రకు సుమిత్ర

442
sushma sumithra
- Advertisement -

బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. బీజేపీ నేతలతో పాటు మాజీ అధికారులను గవర్నర్లుగా నియమించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై-సెప్టెంబర్‌లో ఎనమిది మంది గవర్నర్ల పదవీ కాలం ముగియనుండటంతో ఈ స్థానాల్లో సీనియర్లు,అధికారులతో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది.

గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కల్‌రాజ్‌ మిశ్రా, శాంతాకుమార్‌, ఉమాభారతి, ప్రేంకుమార్‌ ధూమల్‌తో పాటు రిసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) మాజీ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ ధస్మానా, ఐబీ మాజీ అధిపతులు రాజీవ్‌ జైన్‌, దినేశ్వర్‌ శర్మ, మాజీ సీఈసీ ఏకే జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

సుష్మాను పంజాబ్‌కు, సుమిత్రను మహారాష్ట్రకు గవర్నర్లుగా నియమించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు ఈ సారి వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశాలున్నాయని హోం శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఈ సారి గవర్నర్లుగా ఎవరూ ఊహించని వ్యక్తులను కూడా నియమించే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -