- Advertisement -
ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకు శారద పీఠం అంకితం అన్నారు స్వరూపానందేంద్ర సరస్వతి. హిందూ దేవాలయాల భూములు ఆక్రమణ, అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా శారదపీఠం పోరాటం చేసిందన్నారు. ఇన్ని రోజులు చేసిన పోరాటంలో నేను అలసిపోయానని చెప్పారు.
ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వాత్మనంద పని చేస్తారని తెలిపారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమన్నారు. హిందూ పరిరక్షణ కోసం హిందూవులు అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -