కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా సచిన్ ఫైలెట్?

398
Sachin Pilot
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక పై తానూ సామన్య కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని చెప్పారు రాహుల్. ఇక కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలిక అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత మోతిలాల్ వోరాను నియమించారు.

ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి వేటలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో సీనయర్లకు ఛాయిస్ ఇద్దామా లేదా యంగ్ లీడర్స్ కు ఇద్దామా అని ఆలోచిస్తున్నారట. యంగ్ లీడర్ రాజస్ధాన్ యువనేత సచిన్ పైలెట్ పేరు తెరపైకి వచ్చిందట.

సచిన్ ఫైలెట్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతుందట. పార్టీకి యువ నేత సారధ్యం వహించాలని సచిన్ పైలట్ అయితే బాగుంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధినేతగా సచిన్ పైలట్ ను ఎంపిక చేయాలంటూ అమరీందర్ చేసిన ట్వీట్ కు మద్దతు పెరుగుతోంది. సచిన్ ఫైలెట్ ప్రస్తుతం రాజస్ధాన్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

- Advertisement -