కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఇరు పార్టీలకు చెందిన అసంతృప్తులు రాజీనామా చేశారు. కాంగ్రెస్ , జేడీఎస్ కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు . వారి రాజీనామా లేఖలను స్పీకర్ రమేష్ కుమార్ కు సమర్పించారు. కాంగ్రెసుకు చెందిన ప్రతాప్ గౌడ పాటిల్, శివరామ్ హెబ్బార్, రమేష్, మహేష్ కుమాటి హళ్లి, నారాయణ గౌడ, సౌమ్యా రెడ్డ, జెడిఎస్ కు చెందిన గోపాలయ్య, హెచ్. విశ్వనాథ్ తమ రాజీనామాలు సమర్పించి గవర్నర్ ను కలిసేందుకు రాజభవన్ చేరుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం స్థానాలు 224. బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యుల మద్దతు అవసరం. రాజీనామా అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ… కొన్ని అంశాల్లో తనను నిర్లక్ష్యం చేశారని తెలిపాడు. పార్టీలో నేను ఎవరినీ నిందించట్లేదని పేర్కొన్నారు.