తెలంగాణకే తలమానికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ మారనుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్కై వాక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
అన్ని ప్రభుత్వ విభాగాలలో కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ను అనుసంధానం చేస్తామన్నారు.కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం తొందరలోనే పూర్తవుతుందన్నారు.ఈ భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు.
భారతదేశం లోనే తెలంగాణ కు ఈ కమాండ్ కంట్రోల్ తలమానికంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలతో అనుసంధానం చేసి శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుందని తెలిపారు.ఇలాంటి నిర్మాణం ఏర్పాటు చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతిక విధానం అద్భుతాలు సృష్టిస్తుందన్నారుఆర్ అండ్ బి ప్రిన్సిపాల్ సెక్రెటరీ రామకృష్ణ.ఒక్క పోలీస్ శాఖకు మాత్రమే కాదు అన్ని శాఖలకు సంభందించిన అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం లో కమాండ్ కంట్రోల్ ఒక ఐకాన్ గా ఉంటుందన్నారు సీపీ అంజన్ కుమార్.ఈ స్కై వే 200 అడుగులు,0425 మెట్రిక్ టన్నుల బరువుందన్నారు.హైదరాబాద్ లో ఇలాంటి నిర్మాణం చెప్పట్టడం వలన శాంతి భద్రతల కు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.