ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి టీమిండియా..

400
kohli toss
- Advertisement -

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగింది భారత్‌. టాస్‌ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది కోహ్లీ సేన. జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ కు తుదిజట్టులో చోటు దక్కగా కుల్దీప్ బదులు భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కింది.

ఇంగ్లాండ్ తో ఓటమి నేపథ్యంలో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. బర్మింగ్ హామ్ గ్రౌండ్‌ చిన్నది కావడంతో ఒకే స్పిన్నర్‌తో బరిలోకి దిగగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భారీ షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బందిపడిన కేదార్ జాదవ్‌ను పక్కనపెట్టింది భారత్‌.

దినేశ్ కార్తీక్ రాకతో టీమిండియాలో ముగ్గురు వికెట్ కీపర్లకు స్థానం దక్కినట్టయింది. ఇప్పటికే ధోనీ, పంత్ ఆడుతుండగా, వాళ్లకు తోడు డీకే కూడా ఎంటరయ్యాడు

- Advertisement -