నగరంలో మూడు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక..

344
GHMC Commissioner Dana Kishore
- Advertisement -

హైదరాబాద్‌లో హరితహారంలో భాగంగా రాజేంద్రనగర్, కొంగరకలాన్‌లలో నర్సరీలను కమిషనర్ దాన కిషోర్‌తో పాటు అడిషనల్ కమిషనర్ ఆమ్రపాలి కాటా, కృష్ణ పరిశీలించారు. ఇందులో భాగంగా జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ మొక్కల పెంపకం అలాగే నర్సరీలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ.. హరిత హారంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కోట్ల మొక్కలు నాటే విధంగా భారీ ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి.మరో కోటిన్నర మొక్కలను ప్రైవేట్ నర్సరీలు సేకరించేందుకు టెండర్లను పిలిచాం. ఈ వారంలో టెండర్ల ఖరారు చేస్తాం. అనంతరం మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు జిహెచ్ఎంసికి అందుతాయని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ అన్నారు.

- Advertisement -