జియో నుంచి మరో బంపర్ ఆఫర్..

190
Reliance Jio to start broadband service
Reliance Jio to start broadband service
- Advertisement -

టెలికాం రంగంలోకి రిలయన్స్ జియోను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యర్థి కంపెనీల్లో రైళ్లు పరుగెత్తించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. అత్యంత చవకైన ధరకే ఇంటర్నెట్, ఉచిత వాయిస్‌ కాల్స్‌తో టెలికాం రంగంలో సంచలనాలకు తెరతీశారు అంబానీ.. ఇక తన తరువాతి టార్గెట్‌… బ్రాడ్‌బాండ్. మరికొద్ది రోజుల్లో ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు జియో సిద్ధపడినట్లు తెలుస్తోంది. త్వరలో రిలయన్స్ జియో ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వాలని జియో నిర్ణయించింది. 500 రూపాయలకే 600జీబీ డేటాను ఇవ్వనుంది.

జియో గిగాఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ పేరుతో రాబోతున్న ఈ బ్రాడ్‌ బ్యాండ్ స్పీడ్ కూడా 120ఎంబీపీఎస్ నుంచి 1జీబీ మధ్యలో ఉంటుందని రిలయన్స్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను జియోకేర్. నెట్‌లో ఉంచింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బాండ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ముంబై, పూణెలో ఇప్పటికే జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ అందుబాటులో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రవేశపెట్టబోతున్నామని కంపెనీ ప్రకటించింది. కాగా, రిలయన్స్ జియో 185 రూపాయలకే డీటీహెచ్ సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -