చిరు కొరటాల మూవీ ఎప్పుడు అంటే?

323
chiru koratala
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా మూవీలో బిజీగా ఉన్నారు. ప్రముఖ స్వాతత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమాకు సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించగా కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈచిత్ర షూటింగ్ ఇటివలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. ఈసినిమా తర్వాత చిరు కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది.

ఈసినిమాకు కొరటాల శివ స్నేహితుడు నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తుంది. ఇక చిరు జోడిగా నయనతారను తీసుకున్నట్లు తెలుస్తుంది. సైరా మూవీపై భారీ అంచనాలున్నాయి. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈమూవీ భారీ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -