జులై 10వ తేదిలోపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ ఇన్ ఛార్జిల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదులో పత్రాలన్నీపక్కాగా పూర్తి చేస్తేనే బీమా వర్తిస్తుందని, ముప్పై శాతం క్రియాశీల సభ్యత్వం ఉండేలా చూడాలని అన్నారు.
సభ్యత్వ నమోదు పూర్తికాగానే గ్రామ, మండల, వార్డులు, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 51 శాతం ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ ఇన్ చార్జ్ గా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు.
ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలకు అవకాశం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. పార్టీ ప్రచారంలో సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని పార్టీ శ్రేణులకు తెలిపారు.