రియలిస్టిక్ కథలకు టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. అలా 1978కాలంలో పలాస ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే లేటెస్ట్ గా విడుదలైన స్టిల్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బావుందని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్స్ ఆరాలు తీస్తున్నారు. బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వస్తోందీ చిత్రానికి. అలాగే తమిళ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి.
పలాస 1978 ప్రాంతంలో జరిగిన కథ. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ. కాస్త ‘రా’గా ఉండే కథనం ఈ సినిమాకు మేజర్ హైలెట్ కాబోతోంది. ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్‌లతో పాటు ఆ టైమ్‌లో ఇన్ని ఘోరాలు జరిగాయా అనే ఫీల్‌నీ తెస్తుంది. హీరోతో పాటు విలన్ కూడా నాలుగు భిన్నమైన గెటప్సుల్లో కనిపిస్తారు. అవి కూడా వయసుకు సంబంధించి ఉంటాయి. ఈ రకమైన ప్రయోగం కూడా తెలుగులో ఇదే తొలిసారి అంటున్నారు దర్శక నిర్మాతలు. మొత్తంగా స్టిల్స్ తోనే బిజినెస్ వర్గాల్లోనూ, రీమేక్ రైట్స్ విషయంలోనూ.. మంచి హైప్ తెచ్చుకుంది ఈ సినిమా.
దర్శకుడు కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రం. కానీ ఆయన మంచి రచయితగా సాహిత్యలోకంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రకంగా ఇది కథగా ఎంతో బలంగా ఉండబోతోందని కూడా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా చాలా సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించుకుని కేవలం 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకుందీ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల, పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్,సంగీతం : రఘు కుంచె, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన, దర్శకత్వం : కరుణ కుమార్.