మార్కెట్‌లోకి కొత్తనోట్ల పర్సులు….

204
- Advertisement -

పెద్దనోట్ల రద్దుతో ప్రజల కష్టాలు రోజురోజుకుపెరిగిపోతున్నాయి… కొత్త నోటుకు చిల్లర లభించకపోవడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కొనలేని పరిస్థితి ఏర్పడింది. అవినీతి పరుల ఆటకట్టించడానికి మోడీ చేసిన ఈపెద్దనోట్ల రద్దుకు సహాకరించండి అని కేంద్రం చెబుతుంది.

అయితే,…రూ.500,1000 నోట్ల రద్దుతో దేశంలో కరెన్సీ సంక్షోభం ఒకవైపు కొనసాగుతుండగానే చైనా అప్పుడే రంగంలోకి దిగిపోయింది. అంటే నకిలీ కరెన్సీతోనో.. నగదు మార్పిడికోసమో కాదు. కొత్త కరెన్సీ నోట్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయుల మనసు దోచుకునేందుకు చైనా తన మార్కెటింగ్ టెక్నిక్ ను మరోసారి వాడింది. రూ.500 రూ.2000 నోట్ల డిజైన్ తో తయారుచేసిన పర్సులు మన మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. దేశీయ వినియోగదారులను, మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా. దేశీయ కొత్త కరెన్సీని పోలిన మహిళల వాలెట్స్ పర్స్‌ను వినూత్నంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

India market china purses

మన దేశంలో ఇప్పటికే చైనా వస్తువులను నిషేధించాలన్న వాదనలు కొనసాగుతున్నాయి …ఇప్పుడు ఈ విధంగా కొత్తనోట్ల డిజైన్‌తో పర్సులు తయారుచేయడంపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ఒక్క పక్క దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు కొరతతో ప్రజలు కష్టాలుపడుతోంటే.. రూ.2000, రూ.500 నోట్లను పోలిన డిజైన్ తో వాలెట్స్ పర్స్‌లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు మనం దేశం నోట్ల ముద్రణకు ఇబ్బందులు పడుతోంటే.. చైనా మాత్రం అపుడే పర్సులను రెడీ చేసిందన్న కామెంట్లు వినపడుతున్నాయి. కాగా రూ.500 రూ.1000 నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలురంగాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా… ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో పెద్దనోట్ల రద్దుపై శీతాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -