స్మార్ట్‌ఫోన్ యుగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్ త్వరలో మరో అదిరిపోయే ఫచర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. గూగుల్ పే,పే టీమ్,ఫోన్ పే మాదిరిగానే ‘వాట్సాప్ పేమెంట్స్’ సదుపాయాన్ని యూజర్స్ ముందుంచనుంది.
ఈ ఫీచర్‌ను ఎప్పుడో వాట్సాప్ ప్రకటించింది. కానీ పలు కారణాల వల్ల అందుబాటులోకి తేవడం ఆలస్యం అయింది. అతి త్వరలో ఈ ఫీచర్‌ని యూజర్స్‌కు అందుబాటులో ఉంచనుంది.
పేమెంట్స్ ఫీచర్‌లో భాగంగా జరిగే యూజర్ల లావాదేవీలకు చెందిన వివరాల డేటా స్టోరేజ్ కచ్చితంగా భారత్ లోని సర్వర్లలోనే ఉండాలని గతంలో ఆర్‌బీఐ వాట్సాప్‌కు తెలపగా ఆ సంస్థ నిరకరించింది. అయితే అదే సూచనను పాటిస్తామని చెప్పడంతో వాట్సాప్ పేమేంట్స్‌కు క్లియరెన్స్ లభించింది.
వాట్సాప్ భారత్‌లో యూపీఐ ఆధారిత సేవలను ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలసి అందివ్వనుంది. ప్రస్తుతం డేటా లోకలైజేషన్, ఆడిట్ ప్రక్రియ జరుగుతుండగా, ఆ ప్రక్రియ నివేదికను సంబంధిత నియంత్రణ సంస్థకు అందజేశాక వాట్సాప్ పేమెంట్స్ సేవలను ప్రారంభించనుంది. దీంతో ఇకపై యూజర్లు ఆన్‌లైన్ నగదు ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపులు వాట్సాప్ ద్వారా చేయవచ్చు.