- Advertisement -
ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు నలుగురు బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. రేపల్యే ఎమ్మెల్యే సత్యప్రసాద్ బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఆయనతో పాటు మరో 7మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.
సత్యప్రసాద్‌తో పాటు టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ కూడ బీజేపీలో చేరనున్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కాషాయ కండువా కప్పుకున్నారు. ఎంతో మంది టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రేపల్లే అసెంబ్లీ శాసనసభ స్థానం నుండి మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు.
- Advertisement -