షాహిద్ కపూర్, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన చిత్రం కబీర్ సింగ్. ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ సినిమా ఇక్కడ భారీ వసూళ్లను రాబట్టడంతో, షాహిద్ కపూర్ – కైరా అద్వాని జంటగా హిందీలో రీమేక్ చేశాడు. ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది.
కేవలం ఐదు రోజులలోనే 104.9 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్లో తెలిపారు. తొలి రోజు ఈ చిత్రం రూ.20.21 కోట్లు (శుక్రవారం), శనివారం రూ.22.71 కోట్లు, ఆదివారం రూ.27.91 కోట్లు, సోమవారం రూ.17.54 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు.
షాహిద్ కపూర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచింది. 3,123 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాదిలో ఇంతవరకూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిందని అంటున్నారు. సందీప్ వంగాతో మరో సినిమా చేసే ఆలోచలో షాహిద్ కపూర్ ఉన్నాడనేది బాలీవుడ్ టాక్.
#KabirSingh cruises past ₹ 💯 cr… Shahid Kapoor scores his first *solo* century… Extraordinary trending on weekdays… Eyes ₹ 130 cr+ total in Week 1… Fri 20.21 cr, Sat 22.71 cr, Sun 27.91 cr, Mon 17.54 cr, Tue 16.53 cr. Total: ₹ 104.90 cr. India biz. BLOCKBUSTER.
— taran adarsh (@taran_adarsh) June 26, 2019