వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్ లైన్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 28న విడుదలవుతుంది.
ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో… నివేదా థామస్ మాట్లాడుతూ “ఈ సినిమాను అందరూ చూడాలి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ సినిమాను అందరూ చూడాలి. ముఖ్యంగా ఆడవాళ్లు చూడాల్సిన సినిమా ఇది. నాకు ఈ సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు. అంతకు మించి“ అని అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ “బ్రోచేవారెవరుగా స్టోరీ వివేక్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. టైటిల్ ఏంటంటే `బ్రోచేవారెవరురా` అని అన్నారు. సరే `బ్రో` అని అనుకునేవాళ్లం. ఈ కథలో `మిత్ర` అనే పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. ఆ కేరక్టర్ ఎవరు చేస్తారా? అని ఎదురుచూశాను. దానికి భరతనాట్యం, కూచిపూడి చేయాలి. `నిన్నుకోరి`లో ఆమె డ్యాన్సులు చూశాం. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు చూసి ఈ చిత్రంలో ఎలా చేస్తారోనని అనుకున్నాం. ఆమె 20 రోజులు అరుణ మేడమ్ దగ్గర డ్యాన్సులు నేర్చుకున్నారు. పొట్టోళ్లు గట్టోళ్లు అని అంటారు కదా… అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. సినిమా మొత్తం సరదా సరదాగా పూర్తయింది. మంచి సినిమాలు తీయగానే సురేష్‌బాబు లాంటి వాళ్లు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌కి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేస్తున్నాను. దానికి చాలా ఆనందంగా ఉంది. ప్రియదర్శి, రాహుల్‌తో షూటింగ్లో ఉన్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. 28న మా సినిమా వస్తోంది.
నారా రోహిత్ మాట్లాడుతూ “బ్రోచేవారెవరురా టీమ్ చాలా బావుంది. సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కి దగ్గర్లో టీమ్ అంతా ఆనందంగా ఉన్నారంటే, ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటాను. సురేష్‌బాబుగారికి చాలా థాంక్స్. వివేక్ సాగర్ మంచి సంగీతం ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. వివేక్ ఆత్రేయ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.
రామ్ మాట్లాడుతూ “సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. చిన్న సినిమా చేశామో, పెద్ద సినిమా చేశామో. నేను మెంటల్ మదిలో సినిమా చూశాను. వివేక్ చాలా బాగా చేశాడు. ఇలాంటి డైరక్టర్‌కి మంచి స్టార్ కేస్ట్ దొరికింది. `నిన్నుకోరి`లో ఫస్ట్ షాట్ చూసిన తర్వాత నివేదా మంచి పెర్ఫార్మర్ అని తెలిసింది. నేను దర్శితో `ఉన్నది ఒక్కటే జిందగీ` చేశా. తర్వాత కూడా చాలా సార్లు అనుకున్నా. కానీ ఇంకా కుదరలేదు. రాహుల్ రామకృష్ణతో నాకు పెద్ద పరిచయం లేదు. కానీ కొన్ని కేరక్టర్లు వింటుంటే ఆయనే గుర్తుకొస్తున్నారు. సత్య చాలా ఇన్టెన్స్ పెర్ఫార్మర్. సత్య కళ్లల్లో కనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌లో సత్య చాలా మంచి పాత్ర చేశారు. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ఎందుకంటే ప్రేమంట సినిమాలో నాకు తదుపరి జన్మకైనా… పాట రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ నేను ఉన్నది ఒక్కటే జిందగీ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ లో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. చాలా మంచి పెర్ఫార్మెర్ అతను. ఈ నెల 28న విడుదలవుతుంది ఈ సినిమా. నాకు అరుణభిక్షు యాక్టింగ్ నేర్పించారు. ఆవిడ ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది“ అని అన్నారు.