- Advertisement -
హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం లండన్ టూర్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈమెకు సినిమా వాళ్ళతోనే కాకుండా స్పోర్ట్స్ సెలబ్రిటీస్‌తో కూడా పరిచయాలున్నాయి. ముఖ్యంగా సానియా మీర్జాతో ఉపాసనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అనుకోకుండా వీరిద్దరూ లండన్ టూర్ లో కలిసారు.
సానియా మిర్జా కొడుకుతో ఉపాసన కాసేపు సరదాగా గడిపింది. ఇప్పుడు ఆమె కొడుకుతో రామ్ చరణ్ భార్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఈ ఫోటోలలో సానియా మీర్జా, ఆమె సోదరి ఆనం మీర్జా కూడా ఉన్నారు.
- Advertisement -