రూ.100నోటు నిలిపివేత….

224
100-rupee notes Dropping Printing Press
- Advertisement -

రూ.500,1000నోట్ల రద్దుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్లు రద్దు కావడంతో తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు తమ పనులన్ని పక్కన పెట్టి మరి బ్యాంక్‌ల ముందు క్యూలైన్లు కడుతున్నారు. కాని బ్యాంక్‌లో మాత్రం రూ.2000నోటు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ప్రజలకు రూ.2000నోటు చిల్లర దొరకపోవడంతో ఇబ్బందులకు గురివుతున్నారు. తమకు రూ.2000నోటు చిల్లర ఎక్కడ దొరకడంలేదని బ్యాంక్‌ అధికారులకు ప్రజలు తమ గొడును వెలబోసుకుంటున్నారు. కాని ఫలితం లేదు బ్యాంక్‌లో రూ.2000 నోట్లు మాత్రమే ఉన్నాయి 100 నోట్లు లేవు. ఇప్పుడున్న పరిస్థితిలో పెద్దనోట్లకు చిల్లర లేక నానా తంటాలు పడుతుంటే తాజాగా కేంద్రం ప్రజలకు మరో షాక్‌ ఇచ్చింది.

100-rupee notes Dropping Printing Press

కొత్త నోట్ల ప్రింటింగ్‌లో బిజీగా ఉన్న ప్రెస్‌లు రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు ఆర్‌బీఐ వర్గాలను ఉటంకిస్తూ… బ్లూంబర్గ్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇది నిజంగా బాధకరమైన విషయమే. అయితే, నోట్ల రద్దుపై వార్తల్లో వస్తున్న ఈ అభిప్రాయాలు, అంచనాలను ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ తోసిపుచ్చారు. ఇది పూర్తిగా అవాస్తవం. త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతాయి అని మాలిక్‌ తెలిపారు.

100-rupee notes Dropping Printing Press

రూ.500, 100 నోట్ల సరఫరా పెరిగి.. ఏటీఎంల రీ-కాలిబ్రేషన్ పూర్తయితే ఇప్పుడున్న ఇబ్బందులన్నీ చాలా వేగంగానే తొలగిపోతాయి అని డీఎస్ మాలిక్ పేర్కొన్నారు. అయితే, అవసరానికి సరిపడా రూ.100 నోట్ల సరఫరా లేదని, కొరత ఉన్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. కాగా, 2నెలల క్రితమే నోట్ల ప్రింటింగ్ మొదలైందని.. దీనివల్ల కరెన్సీ సరఫరా తగినంతగానే ఉందని ఆర్‌బీఐ గురువారం ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు విషయంలో ముందస్తూ చర్యలు తీసుకోవడం విఫలం అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

- Advertisement -