నడిఘర్ సంఘానికి 2019 – 2022 ఏడాదికిగానూ జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగాయి. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి నడిఘర్ సంఘం ఎన్నకలు నువ్వా నేనా అన్నట్లు సాగాయి.
నడిగర్ సంఘంలో మొత్తం 3,100 మంది సభ్యులు ఉండగా 1,587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్‌లోని సెయింట్ ఎబాస్ బాలికల పాఠశాలలో పోలింగ్ నిర్వహించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
నడిగర్ సంఘం అధ్యక్ష పదవికి పాండవార్ జట్టు నుంచి నటుడు నాజర్, శంకర్‌దాస్ జట్టు నుంచి నటుడు భాగ్యరాజ్ బరిలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పదవికి విశాల్, నిర్మాత గణేశ్ పోటీపడుతున్నారు. కోశాధికారి పదవికి నటుడు కార్తీక్, నటుడు ప్రశాంత్ బరిలో ఉన్నారు.
మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు జులై 8న ఓట్ల లెక్కింపు జరగనుండగా కోర్టు తుది తీర్పు తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు.