కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఏపీ సీఎం జగన్‌కు మేడిగడ్డ వద్ద ఘనస్వాగతం పలికింది. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జగన్‌కు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్‌తో పాటు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన నేరుగా మేడిగడ్డకు విచ్చేశారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు మేడిగడ్డకు చేరుకొని జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్ మోటార్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.