అంతర్జాతీయ 5వ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ సంస్కృతి భవనంలో యోగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నరసింహన్ యోగ అనేది మనుసు ఆహ్లాదాన్ని ఇచ్చేదన్నారు.
ఇకపై ప్రతీ రోజు యోగ తరగతులు నిర్వహిస్తాం అని చెప్పిన గవర్నర్ ప్రతి ఒక్కరు యోగ చేయాలన్నారు.యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని…రాజ్ భవన్ స్టాఫ్ అందరి కోసం యోగ శిక్షణ తరగతులు నిరవహిస్తామని చెప్పారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో ని తెలంగాణ భవన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి, డిప్యూటీ కమిషనర్ రామ్మోహన్, ఉద్యోగులు పాల్గొన్నారు.