జగన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ..

269
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన కనకదుర్గమ్మ అమ్మవారి అలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

CM KCR

ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదారంగా జగన్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావలసిందిగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి గేట్‌ వే హోటల్‌కు వెళతారు. తర్వాత 5 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు.

CM KCR

అక్కడి నుండి రాత్రి 7.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.

- Advertisement -