విజయవాడలో సీఎం కేసీఆర్..

463
cm kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఈ నెల 21న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు కేసీఆర్. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. కాసేపట్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తాడేపల్లిలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి కేసీఆర్‌ వెళ్లనున్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణకు సీఎం కేసీఆర్‌ హాజరు కానున్నారు.

సీఎం కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మహారష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఇంతకుముందే ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏపీ,మహారాష్ట్ర సీఎంలతో పాటు గవర్నర్‌లు నరసింహన్‌,విద్యాసాగర్ రావులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

- Advertisement -