వెయ్యినోటు ఇక లేనట్టేనా..?

219
- Advertisement -

పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుగా కొత్త 2000 రూపాయల నోటును విడుదల చేసింది. ఆ తర్వాత కొంత గ్యాప్‌తో 500 రూపాయల నోటును మార్కెట్‌ లోకి రిలీజ్ చేసింది. అయితే 2000 రూపాయల నోటుకు చిల్లర దొరకడం కష్టమవుతుండడంతో,,ప్రజలంతా కొత్త వెయ్యి రూపాయల నోటు ఎప్పుడు వస్తుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు కొత్త వెయ్యి రూపాయల నోటుకు డిజైన్ చేస్తున్నామని,,త్వరలోనే వెయ్యి నోటు అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.

1000 MONEY

కొత్త డిజైన్‌తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ఇప్పట్లో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలో మొత్తం 2 లక్షల ఏటీఎం మిషన్లు ఉండగా.. వాటిలో 10 శాతం అంటే దాదాపు 2,200 ఏటీఎంలను గురువారం నాడు రీకాలిబరేట్ చేయనున్నట్టు తెలిపాడు. వాటి నుంచి కొత్త రూ. 2000 నోటు సహా అన్నింటినీ విత్‌డ్రా చేసుకోడానికి వీలుగా తయారుచేస్తున్నట్లు చెప్పారు.

1000 MONEY

ప్రస్తుతానికి వాటి నుంచి 100 రూపాయలతో పాటు కొత్త 500, 2000 రూపాయల నోట్లను కూడా విత్‌డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
బ్యాంకులలో నగదు మార్పిడి నిబంధనను రూ. 4500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని మీడియా ప్రశ్నించగా.. అందుబాటులో ఉన్న నిధుల దుర్వినియోగం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సామాన్యులకు ఊరట కలిగించేందుకే పెళ్లి సందర్భంగా ఖర్చుల కోసం రూ. 2.5 లక్షలు తీసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. నోట్ల రద్దు ప్రకటన సమయంలో రూ.వెయ్యి నోట్లను తిరిగి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ప్రస్తుతానికైతే రూ.1000 నోట్లను తిరిగి తెచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -