కరోనా వైరస్ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1000మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా గత 24గంటల్లో 92మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిం .దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1071కి చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారి లవ్ అగర్వాల్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి.. లోకల్ ట్రాన్స్‌మిష్ స్టేజ్‌లోనే ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవేళ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు వెళ్తితే, దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి కేసులు ఏమీ లేవని లవ్ అగర్వాల్ తెలిపారు.ఈశాన్య రాష్ట్రాలకు వైద్య పరికరాలను అందించేందుకు ఈశాన్య అభివృద్ధి శాఖ కార్గో విమానాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా 3.34 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. కాగా కరోనా నియంత్రణకు దేశ వ్యాప్తంగా ఈ నెల 14వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.