దుమ్ములేపుతున్న ’90 ఎం.ఎల్‌’ సాంగ్..!

484
90ML

‘ఆర్‌ఎక్స్100′ ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం ’90 ఎం.ఎల్‌’. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘ఆర్‌ ఎక్స్100’ తో సంచలన విజయం సృష్టించిన కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నేహా సోలంకి ఇందులో కథానాయిక. అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోష‌న్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి పాటను విడుదల చేశారు.‘సింగిలు.. సింగులు.. సింగులు సింగారానివే.. నువ్వు! నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే’ అంటూ హీరోయిన్ నేహా సొలంకీతో కార్తికేయ ఆడిపాడాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత అందించారు. అయితే ఈ సాంగ్‌ను బిగ్ బాస్2 ఫేం రోల్ రైడా ర్యాప్ అందించారు. బిగ్ బాస్ 3 విన్న‌ర్ రాహుల్.. మాన‌సితో క‌లిసి ఆల‌పించారు.

ఇక ఈ ‘ఆర్‌ఎక్స్100’ హీరో నటించిన గత రెండు చిత్రాలు అంతగా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఇప్పుడొస్తున్న 90 ఎమ్ఎల్ మూవీ పైనే కార్తికేయ నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్‌ అందుకుంటాడో చూడాలి.