కొత్త ఖండం…’జీలాండియా’

223
8th Continent Has Been Discovered
- Advertisement -

భూమిపై ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోకుండా , ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా ఉన్న మరో ఖండం వెలుగులోకి వచ్చింది. చిచిన్నపటి నుంచి ప్రపంచంలో ఏడు ఖండాలున్నాయనే అందరం చదువుకున్నాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా మాత్రమే మనకు తెలిసిన ఖండాలు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో జీలాండియా అనే కొత్త ఖండం వచ్చి చేరింది. 4 లక్షల 90వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ కొత్త ఖండం ప్రపంచంలోనే చిన్నది. ఇప్పటి వరకు 8 లక్షల 60 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో చిన్న ఖండంగా ఆస్ట్రేలియా గుర్తింపుపొందింది. జీలాండియా ఆ ప్లేస్ ను రిప్లేస్ చేసింది.

ఇంతకాలం అంతరిక్షంలోని గ్రహాలు, గ్రహాంతర వాసుల కోసం సాగుతున్న అన్వేషణల నేపథ్యంలో భౌగోళిక పరిశోధక శాస్త్రజ్ఞులు కనుగొన్న ఈ కొత్త ఖండం ఉనికికి సంబంధించిన తమ అన్వేషణలకు ఇప్పుడు ఉపగ్రహ సమాచారం, అక్కడ దొరికిన రాతి పలకలతో మరింతగా ఆధారాలు లభించాయని వెల్లడైంది. 11 మంది శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ కొత్త ఖండం వెలుగులోకి వచ్చింది. జీలాండియా ఖండంలో 94 శాతం నీరే ఉందని సైంటిస్టులు తెలిపారు. ఓ ఖండానికి కావాల్సిన అన్ని లక్షణాలు జీలాండియాకి ఉన్నాయని చెబుతున్నారు.

కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కొత్త ఖండం కూడా ఆస్ట్రేలియాలోనే కలిసి ఉంది. భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్లతో వచ్చిన మార్పులతో…. జీలాండియా ప్రాంతం విడిపోయింది. వందల సంవత్సరాల పాటు అలా పక్కకు వెళ్లి పసిఫిక్ మహాసముద్రంలోనే ఉండిపోయింది. న్యూజిలాండ్, న్యూ కలెడోనియాలలోని భాగాలు దీనిలో కలిసినట్లు చెప్పారు.

- Advertisement -