ఏపీలో కొత్తగా 864 కరోనా కేసులు నమోదు..

20
corona

ఏపీలో గడచిన 24 గంటల్లో 38,746 కరోనా పరీక్షలు నిర్వహించగా, 864 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 141 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 135, కడప జిల్లాలో 117, ప్రకాశం జిల్లాలో 114, చిత్తూరు జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 1,310 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,010కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,30,849 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,02,187 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,652 మంది చికిత్స పొందుతున్నారు.