- Advertisement -
నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఎన్నికల ప్రక్రియ జరిగింది. క్యూ లైన్లలో ఉన్న వారిని పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు కోవిడ్ బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 వరకూ 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 84.32 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ పోటీ చేశారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- Advertisement -