సూర్యాపేటలో 83 పాజిటివ్ కేసులు: సోమేశ్ కుమార్

261
somesh kumar
- Advertisement -

సూర్యాపేట లో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనాపై మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అదనపు అధికారులను నియమించాం అన్నారు.

కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని..ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశాం అన్నారు.ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఎవరు వచ్చారనేదానిపై సర్వే చేయాలని నిర్ణయించామని..క్వారెంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే దానిపై సూచనలు చేశాం అన్నారు.

త్వరలో పరిస్ధితి కంట్రోల్ లోకి వస్తుంది…జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. వారికి పూర్థిస్థాయిలో మద్ధతుగా ఉంటాం…టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాం అని చెప్పారు.

- Advertisement -