ప్రభాస్ మిర్చి @ 8

168
prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిర్చి. 2013 ఫిబ్రవరి 8న సరిగ్గా 8 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. మిర్చి కంటే ముందు ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా కొరటాల తాను ఎంచుకున్న కథను చక్కగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీసి సక్సెస్ సాధించారు. ముఖ్యంగా ప్రభాస్‌ని సరికొత్తగా చూపిస్తూ హిట్‌కి కేరాఫ్‌గా నిలిపారు కొరటాల.

ప్రభాస్ నటన,పాటలు,బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా జై పాత్రలో ఇరగదీశాడు ప్రభాస్‌. ముఖ్యంగా ఫైట్స్ సీన్స్‌లో ప్రభాస్ నటన సూపర్బ్. కత్తి పట్టి నరుక్కోవడం కంటే ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడం మంచిదన్న కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆలోచింపచేసింది.

దర్శకుడిగా తొలి సినిమా మిర్చితోనే నంది పురస్కారాన్ని అందుకున్నారు కొరటాల. అంతేగాదు 2013 ఉత్తమ చిత్రంగా నిలిచింది మిర్చి. ఈ సినిమాతో ప్రభాస్‌ ఉత్తమ నటుడుగా, ఉత్తమ ప్రతి నాయకుడు (సంపత్ రాజ్), ఉత్తమ గాయకుడిగా (కైలాష్ ఖేర్ – పండగలా దిగివచ్చాడు), ఉత్తమ కళాదర్శకుడు (ఏ.ఎస్. ప్రకాష్) అవార్డులు అందుకున్నారు. సినిమా విడుదలై 8 సంవత్సరాలు కావొస్తున్న నేపథ్యంలో మిర్చి హ్యాష్ ట్యాగ్‌ని షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

- Advertisement -